Share News

శ్మశానం రస్తాలో చెత్త డంప్‌

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:19 AM

పట్టణంలోని చెత్తను తీసుకొచ్చి శ్మశానానికి వెళ్లే రస్తాలో డంప్‌ చేస్తున్నారని, దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని 24వ వార్డు కౌన్సిలర్‌ చాంద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు.

  శ్మశానం రస్తాలో చెత్త డంప్‌

అధికారుల తీరుపై

కౌన్సిలర్ల ఆగ్రహం

వాడీవేడిగా మున్సిపల్‌ సమావేశం

నందికొట్కూరు, జనవరి 31(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని చెత్తను తీసుకొచ్చి శ్మశానానికి వెళ్లే రస్తాలో డంప్‌ చేస్తున్నారని, దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని 24వ వార్డు కౌన్సిలర్‌ చాంద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని జై కిసాన పార్కులో మున్సిపల్‌ చైర్మన దాసి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ అధికారుల తీరుపై పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కౌన్సిల్‌ సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ చాంద్‌బాషా మాట్లాడుతూ పట్టణంలో చాలా ఇళ్లకు మున్సిపాలిటీ అధికారులు పన్నులు వేయడం లేదన్నా రు. దీనితో రెవెన్యూ ఆదాయానికి గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్‌ చిన్నరాజు మాట్లాడుతూ పట్టణంలో నిర్మించుకున్న ఇళ్లకు పొజిషన సర్టిఫికెట్లు మంజూరు చేయడంలో మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కౌన్సిలర్‌ కురువ లక్ష్మిదేవి మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉందని పరిష్కరించాలని కోరారు. కౌన్సిలర్‌ రావూఫ్‌ మా ట్లాడుతూ తన వార్డులో విద్యుత స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. కమిషనర్‌ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెనువెంటనే పరిష్కరిస్తామన్నారు. చైర్మన దాసి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టి సారించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్‌ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 12:19 AM