రెండు నెలలుగా గోదావరిలోనే గండిపోశమ్మ
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:26 AM
జూలై నెల చివరి వారంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో.. ఉపనదులు పొంగి ప్రవహించి గోదావరి నదిలో చేరి ముంపు గ్రామాలను ముంచెత్తాయి
రెండు నెలలుగా గోదావరిలోనే గండిపోశమ్మ
గోదావరి ఉధృతితో
పాపికొండల యాత్రకూ బ్రేక్
దేవీపట్నం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): జూలై నెల చివరి వారంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో.. ఉపనదులు పొంగి ప్రవహించి గోదావరి నదిలో చేరి ముంపు గ్రామాలను ముంచెత్తాయి. గండిపోశమ్మ ఆలయం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. అప్పటి నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు దూరమయ్యారు. వరద తగ్గినప్పుడు మైదాన ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆలయానికి దగ్గరలో ఉన్న కొండపై ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఆగిన పర్యాటక బోట్లు
గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను ఆపేశారు. జూలై నెలాఖరున పర్యాటకుల భద్రత దృష్ట్యా బోట్ల నిర్వాహకులు సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి వరద కొనసాగుతుండటంతో రెండు నెలలుగా పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. వరద తగ్గి అధికారులు అనుమతి ఇచ్చే వరకు యాత్రకు తాత్కాలిక విరామం ఏర్పడింది.