Share News

బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకునేందుకు జగన్‌ కుట్రలు: ఎమ్మెల్యే గల్లా

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:09 AM

బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసిన జగన్‌ వారికి దక్కాల్సిన రిజర్వేషన్లనూ అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు.

బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకునేందుకు జగన్‌ కుట్రలు: ఎమ్మెల్యే గల్లా

  • వాటిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: పూల నాగరాజు

అమరావతి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసిన జగన్‌ వారికి దక్కాల్సిన రిజర్వేషన్లనూ అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న లక్ష్యానికి టీడీపీ కట్టుబడి ఉందని, హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే సుప్రీంకోర్టును ఆశ్రయించి బీసీలకు రిజర్వేషన్‌ సాధిస్తామని తెలిపారు. కడపలో ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ పూల నాగరాజు మాట్లాడుతూ, ‘బీసీ రిజర్వేషన్‌లపై మాట్లాడే అర్హత గొడ్డలి పార్టీ జగన్‌రెడ్డికి ఏమాత్రం లేదు. ముందస్తు కుట్రతో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలనే ధ్యేయంతో వైసీపీ కుహనా రాజకీయాలకు తెరతీసింది’ అని ఆరోపించారు.

Updated Date - Oct 03 , 2026 | 05:09 AM