Share News

విలువల వైతాళికుడు గజ్జెల: ఘంటా

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:23 AM

పాత్రికేయ రంగంలో విలువల వైతాళికుడు గజ్జెల మల్లారెడ్డి స్థానం అపూర్వమైందని తెలంగాణ అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.

విలువల వైతాళికుడు గజ్జెల: ఘంటా

  • ముగ్గురు పూర్వ సంపాదకులకు జీవన సాఫల్య పురస్కారాలు

కడప ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): పాత్రికేయ రంగంలో విలువల వైతాళికుడు గజ్జెల మల్లారెడ్డి స్థానం అపూర్వమైందని తెలంగాణ అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం-గజ్జెల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం శనివారం వైవీయూలోని అన్నమాచార్య సెనేట్‌ హాల్లో జరిగింది. 2023, 2024, 2025 సంవత్సరాలకు ఈ పురస్కారాలను అందజేశారు. ఆం ధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్‌, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవిలకు దుశ్శాలువ, జ్ఞాపిక, రూ.50 వేల నగదుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడు తూ... ‘1970-95 కాలం జర్నలిజానికి స్వర్ణయుగం. నిజాయితీ, వ్యంగ్యం విమర్శలతో పత్రికారంగానికి మల్లారెడ్డి దిశానిర్దేశం చేశారు’ అని అన్నారు. వైవీయూ వీసీ బెల్లంకొండ రాజశేఖర్‌ మాట్లాడుతూ... మల్లారెడ్డి ఫిలాసఫీ నేటికీ సమాజానికి మార్గదర్శకమని చెప్పారు. పురస్కార గ్రహీతలు జర్నలిజంలో విలువల పతాకాన్ని ఎగురవేసిన వారని వక్తలు కొనియాడారు.

Updated Date - Feb 22 , 2026 | 05:23 AM