ఈ ఏడాదే గగన్‌యాన్-జీ1 ప్రయోగం: షార్
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:26 AM
ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టు పనులు కీలక దశకు చేరుకున్నాయని షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు.
సూళ్లూరుపేట, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టు పనులు కీలక దశకు చేరుకున్నాయని షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. గగన్‌యాన్-జీ1 ప్రయోగం ఈ ఏడాదే ఉంటుందన్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది తొలుత మానవ రహితంగా గగన్‌యాన్-జీ1, గగన్‌యాన్-జీ2, గగన్‌యాన్-జీ3 ప్రయోగాలు చేపడతామన్నారు.