Share News

ఏపీలో గద్దర్‌ విగ్రహం ఏర్పాటుకు అనుమతించండి

ABN , Publish Date - Feb 05 , 2026 | 06:25 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, గద్దర్‌ అభిమానుల కోరిక మేరకు ఏపీలో గద్దర్‌ విగ్రహం ప్రతిష్ఠకు అనుమతులు ఇవ్వాలని గద్దర్‌ కుమార్తె వెన్నెల సీఎం చంద్రబాబును కోరారు.

ఏపీలో గద్దర్‌ విగ్రహం ఏర్పాటుకు అనుమతించండి

  • సీఎం చంద్రబాబుకు గద్దర్‌ కుమార్తె వినతి

అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, గద్దర్‌ అభిమానుల కోరిక మేరకు ఏపీలో గద్దర్‌ విగ్రహం ప్రతిష్ఠకు అనుమతులు ఇవ్వాలని గద్దర్‌ కుమార్తె వెన్నెల సీఎం చంద్రబాబును కోరారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌కి గద్దర్‌ పేరు పెట్టాలని, ప్రజా జీవనంలో కలుస్తున్న మావోయిస్టులకు ఉపాధి కల్పించాల్సిందిగా సీఎంని కోరారు. సీఎంని చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం ఇచ్చారు.

Updated Date - Feb 05 , 2026 | 06:26 AM