Share News

వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా వీరపాండ్యన్‌

ABN , Publish Date - Jul 13 , 2026 | 03:34 AM

వైద్య, కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌, జాతీయ ఆరోగ్య మిషన్‌ ఎండీ జి.వీరపాండ్యన్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. 2009 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయనను..

వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా వీరపాండ్యన్‌

అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): వైద్య, కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌, జాతీయ ఆరోగ్య మిషన్‌ ఎండీ జి.వీరపాండ్యన్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. 2009 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయనను వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ కార్యదర్శిగా నియమించింది. దీంతోపాటు ఆయనకు ఏపీఎంఎస్ఐడీసీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ర్టేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) అప్పగించింది. ఇప్పటి వరకు ఈ మూడు పోస్టులకు ఎఫ్‌ఏసీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న 2000 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఎస్‌.సురేశ్‌కుమార్‌ను ఆ మూడు పోస్టుల నుంచి రిలీవ్‌ చేసింది.

Updated Date - Jul 13 , 2026 | 03:35 AM