Share News

సీఎస్‌గా సాయిప్రసాద్‌

ABN , Publish Date - Mar 01 , 2026 | 05:58 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఉదయం సీఎస్‌గా పదవీ విరమణ చేసిన కె.విజయానంద్‌ సమక్షంలో...

సీఎస్‌గా సాయిప్రసాద్‌

  • విజయానంద్‌ నుంచి బాధ్యతల స్వీకరణ

  • సీఎం ఎక్స్‌అఫీషియో స్పెషల్‌ సీఎస్‌గా విజయానంద్‌

  • రీ-ఎంప్లాయిమెంట్‌ కింద సర్వీస్‌ ఏడాది పొడిగింపు

  • టీటీడీ రెగ్యులర్‌ ఈవోగా ముద్దాడ.. సీఎంవో నుంచి బదిలీ

అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఉదయం సీఎస్‌గా పదవీ విరమణ చేసిన కె.విజయానంద్‌ సమక్షంలో ఆయన బాధ్యతలు తీసుకుని ఫైలు పై సంతకం చేశారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11.33 గంటల కు సీఎస్‌ సీటుపై ఆసీనులైన జి.సాయిప్రసాద్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు వేద ఆశీర్వచనా లు అందించారు. నూతన సీఎ్‌సకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌.ఎస్‌.రావత్‌, ఎం.టి.కృష్ణబాబు, ఎక్స్‌ అఫీషియో స్పెషల్‌ సీఎస్‌ బి.రాజశేఖర్‌తో పాటు ముఖ్య కార్యదర్శులు శ్యామలరావు, ముఖేశ్‌ కుమార్‌ మీనా, కాంతిలాల్‌ దండే ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ నూతన సీఎ్‌సకు పుష్పగుచ్ఛం అందించి, అసోసియేషన్‌ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌కు చేరుకున్న జి.సాయిప్రసాద్‌కు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కుటుంబ సభ్యులు, సీఎస్‌ కార్యాలయ సిబ్బందితో పాటు ఇతర అధికారులతో ఫొటోలు దిగారు. మే 30వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సీఎస్‌ పదవితో పాటు రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌గా, జలవనరుల శాఖ స్పెషల్‌ సీఎస్‌గా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.


సీఎం స్పెషల్‌ సీఎస్‌గా విజయానంద్‌

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ పొందిన కె.విజయానంద్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రీ-ఎంప్లాయిమెంట్‌ కింద ఆయన సర్వీ్స్‌ ను మరో ఏడాది పొడిగించింది. ఆదివారం (మార్చి 1వ తేదీ) నుంచి ఆయన రీ-ఎంప్లాయిమెంట్‌ కింద ప్రభుత్వ సర్వీ్స్‌లో కొనసాగుతారు. సీఎం ఎక్స్‌అఫీషియో స్పెషల్‌ సీఎస్‌గా గా ఆయన్ను ప్రభుత్వం నియమించింది. దీంతో పాటు ఇంధన శాఖ స్పెషల్‌ సీఎ్‌సగా, ఏపీ ట్రాన్స్‌కో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. శనివారం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కె. శ్యామలరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం స్పెషల్‌ సీఎ్‌సగా విధులు నిర్వహిస్తున్న ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం టీటీడీ రెగ్యులర్‌ ఈవోగా నియమించింది. ప్రస్తుతం ఆయన సీఎం స్పెషల్‌ సీఎస్‌ బాధ్యతలతో పాటు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీటీడీకి రెగ్యులర్‌ ఈవో లేకపోవడంతో అడ్మినిస్ట్రేషన్‌ సమస్యలు రావడంతో ప్రభుత్వం ఆయనను సీఎంవో నుంచి బదిలీ చేసి టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యత లు అప్పగించింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కె.శ్యామలరావు ఈ మేరకు మరో జీవో జారీ చేశారు.

Updated Date - Mar 01 , 2026 | 05:59 AM