Share News

నూతన సీఎస్‌గా సాయిప్రసాద్‌

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:05 AM

రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్‌ కె.విజయానంద్‌ పదవీ కాలం శనివారంతో ముగియనుంది.

నూతన సీఎస్‌గా సాయిప్రసాద్‌

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్‌ కె.విజయానంద్‌ పదవీ కాలం శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబరు 29నే సాయిప్రసాద్‌ నియామక ఉత్తర్వులు విడుదలయ్యాయి. శనివారం ఉదయం ఆయన అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 1991 బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన జి.సాయిప్రసాద్‌ ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీఎంకు ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 1992లో వరంగల్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. అక్కడి నుంచి వివిధ కీలకమైన పోస్టుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కర్నూలు, చిత్తూరు కలెక్టర్‌గా, ట్రాన్స్‌కో జేఎండీగా, ఈపీడీపీసీఎల్‌ సీఎండీగా, సీపీడీసీఎల్‌ సీఎండీగా, కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా, ఏపీ సీఎం కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా.. ఇంకా అనేక హోదాల్లో పనిచే శా రు. 2024లో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితుల య్యారు. 2025లో సీఎం ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు స్వీకరించారు. సాయిప్రసాద్‌ ఈ ఏడాది మే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓఎ్‌సడీగా విధులు నిర్వహిస్తున్న పి.ఫలచంద్రరావును ప్రభుత్వం బదిలీ చేసింది. పాలనాపరమైన కారణాలతో ఆయన్ను సాంఘిక సంక్షేమ విభాగం అదనపు కార్యదర్శిగా బదిలీ చేస్తూ శుక్రవారం సీఎస్‌ కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Feb 28 , 2026 | 05:05 AM