నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:10 PM
పట్టణంలో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర రజక కార్పొరేషన చైర్‌పర్సన సావిత్రి కోరారు.
ఎంపీని కలిసిన రజక కార్పొరేషన చైర్‌పర్సన
ఆదోని టౌన, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర రజక కార్పొరేషన చైర్‌పర్సన సావిత్రి కోరారు. ఆదివారం రజక సంఘం నాయకులతో కలిసి ఆమె కర్నూలులో ఎంపీ బస్తిపాటి నాగరాజును కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం గురించి రజకులకు ఇచ్చిన హామీను గుర్తు చేస్తూ పట్టణ రజకుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. అందుకు ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఎంపీను కలిసిన వారిలో రజక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సతీష్, నాగప్ప, బేరి నాగరాజు, బేరి ఈరన్న, రామన్న, శ్రీనివాసులు, నాగరాజు, స్వామి గోవిందప్ప, నరసింహులు పాల్గొన్నారు.