ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:04 AM
జిల్లా పశ్చిమ ప్రాంత సాగు,తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆదోని జిల్లా సాధన అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రఘురామ య్య, ఆర్థిక కార్యదర్శి కృష్ణమూర్తి గౌడ్ కోరారు.
ఆదోని జిల్లా ఏర్పాటుపై సీఎం దృష్టికి తీసుకెళ్లాలి
మంత్రి రామానాయుడుని కలిసిన జిల్లా సాధన సభ్యులు
ఆదోని అగ్రికల్చర్, జూన 15(ఆంధ్రజ్యోతి) : జిల్లా పశ్చిమ ప్రాంత సాగు,తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆదోని జిల్లా సాధన అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రఘురామ య్య, ఆర్థిక కార్యదర్శి కృష్ణమూర్తి గౌడ్ కోరారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ, బీజేపీ రాష్ట్ర నాయకుడు విట్టా రమేష్, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణతో కలిసి ఆదోని జిల్లా సాధన కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాలను కలిపి ఆదోని జిల్లా చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రజ లు డిమాండ్ చేస్తున్నారన్నారు. 156 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన మునిసిపాలిటీ ఆదోని అన్నారు. పాలకులు అభివృద్ధిని విస్మరించారన్నారు. వేదవతి, హంద్రీనీవా సుజల స్రవంతి, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం, ఆర్‌డీఎస్ కుడి కాలువ పనులకు నిధులు కేటాయిస్తే ఈ ప్రాంత గ్రామాలు సన్యసశ్యామలమవుతాయని తెలిపామన్నారు. ఆదోని జిల్లా ఆవశ్యకత సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలిపారు. కమతం వెంకటేశు, హనుమంతరావు పాల్గొన్నారు.
మంత్రి దృష్టికి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమస్య
ఆదోని, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఆదోని పట్టణవాసులను ఏళ్ల తరబడి వేధిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. వర్షాకాలంలో బ్రిడ్జిపై నీరు నిలిచిపోయి ప్రయాణికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి ప్రత్యేక చొరవ చూపారు. స మస్యను మంత్రి నిమ్మల రామానాయుడి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మం త్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం బ్రిడ్జి హైవేస్ పరిధిలోకి వస్తుందని గుర్తిం చి సమస్యను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.