Share News

ఇంధన నిల్వలపై తీవ్ర ప్రభావం!

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:29 AM

పశ్చిమాసియాలో మరో వారం, పది రోజులు యుద్ధం ఇలాగే కొనసాగితే పెట్రోల్‌ నిల్వలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఆంధ్రప్రదేశ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రో డీలర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ పేర్కొన్నారు.

ఇంధన నిల్వలపై తీవ్ర ప్రభావం!

  • యుద్ధం మరో పది రోజులు కొనసాగితే ఇబ్బందే

  • ‘పెట్రో డీలర్స్‌’ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ వెల్లడి

గుంటూరు, మార్చి 3(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో మరో వారం, పది రోజులు యుద్ధం ఇలాగే కొనసాగితే పెట్రోల్‌ నిల్వలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఆంధ్రప్రదేశ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రో డీలర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల ఇంధన నిల్వలపై పడే ప్రభావం గురించి మంగళవారం గుంటూరులో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రాష్ట్రంలో 5 వేల వరకు పెట్రోల్‌ బంకులు ఉన్నాయని, రోజుకు లక్షలాది లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం జరుగుతోందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఆయిల్‌ నిల్వలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికైతే ఇబ్బంది లేదని, మరో పది రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగితే సమస్యే అన్నారు. డాలర్‌ మారకం విలువలో మార్పుల ప్రభావం కూడా ముడి చమురు ధరలపై పడే అవకాశం ఉందని తెలిపారు. తద్వారా నిత్యావసర సరుకుల ధరలతోపాటు అన్నింటిపై భారం పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 04:32 AM