ఇంధన పొదుపు తప్పనిసరి: మంత్రి నాదెండ్ల
ABN , Publish Date - May 16 , 2026 | 05:12 AM
‘ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇంధన వనరుల పొదుపు పాటించాలి. ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఏలూరు,మే 15(ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇంధన వనరుల పొదుపు పాటించాలి. ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజా రవాణాకు మరింత అనుకూలంగా మరిన్ని ఆర్టీసీ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లోనే పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3 పెంచారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా సొసైటీలకు 50 శాతం బకాయిలను ఇటీవల చెల్లించాం. మిగిలిన బకాయిలు నెలాఖరులోగా చెల్లిస్తాం’ అని మనోహర్ తెలిపారు.