చెంచులకు ఉచిత స్పర్శ దర్శనం
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:39 PM
శ్రీశైల క్షేత్ర పరిధిలోని చెంచు గిరిజనుల ప్రాముఖ్యతను గుర్తించిన దేవస్థానం నేలలో ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనం ్జకల్పించడం హర్షనీయమని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
శ్రీశైలం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్ర పరిధిలోని చెంచు గిరిజనుల ప్రాముఖ్యతను గుర్తించిన దేవస్థానం నేలలో ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనం ్జకల్పించడం హర్షనీయమని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. గత నెలలో ముక్కోటి ఏకాదశికి ప్రారంభమైన చెంచుల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం ప్రతి నెల ఆఖరి బుధవారం రోజున ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా బుధవారం మేకలబండ, హఠకేశ్వరం, సున్నిపెంట, పల్నాడు, మాచర్ల, దుర్గి మండల తీరాల్లో నివాసం ఉండే సుమారు 232 మంది చెంచులకు స్వామివారి స్పర్శ, అమ్మవారి దర్శనాలు చేసుకున్నారు. తప్పెట చప్పుళ్లతో గిరిజన సంప్రదాయ నృత్యాలు చేసుకుంటూ ఆలయ ప్రవేశం చేసిన వీరికి అధికారులు సిబ్బంది ఘనస్వాగతం పలికి దర్శనభాగ్యం కల్పించారు.