ఏపీ గ్రామీణ మహిళలకు త్రోబాల్ శిక్షణ
ABN , Publish Date - May 04 , 2026 | 04:22 AM
దేశంలోనే అతి పెద్ద గ్రామీణ క్రీడా మహోత్సవం ఈశా గ్రామోత్సవం-2026 కోసం ముందస్తుగా ఏపీ, తెలంగాణలో 14 ఏళ్లు, అంతకంటే పైబడిన గ్రామీణ...
ఈశా గ్రామోత్సవం కోసం సన్నద్ధత
అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతి పెద్ద గ్రామీణ క్రీడా మహోత్సవం ఈశా గ్రామోత్సవం-2026 కోసం ముందస్తుగా ఏపీ, తెలంగాణలో 14 ఏళ్లు, అంతకంటే పైబడిన గ్రామీణ మహిళల కోసం ఉచిత త్రోబాల్ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఈశా ఫౌండేషన్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపారు. పాల్గొనే వారికి నిపుణుల మార్గదర్శకత్వంలో శిక్షణ, ఆసక్తికరమైన కార్యకలాపాలు, ప్రతిరోజూ అల్పాహారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరులో మే 27 నుంచి 31 వరకు బండపల్లి జడ్పీ హైస్కూల్, గుడిపాల సీఎన్‌ఆర్ పాఠశాలలో శిక్షణ తరగతులు జరుగుతాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పూడిపర్తిలో మే 13 నుంచి 17 వరకు, బుచ్చిరెడ్డిపెలం మండలం కొత్తల్లులో మే 20 నుంచి 24 వరకు శిబిరాలు నిర్వహిస్తారు. అదనంగా వెంకటాచలం మండలం కనుపూరులో శిబిరం నిర్వహిస్తారు. విశాఖపట్నంలో మే 27 నుంచి 31 వరకు శిబిరం జరుగుతుంది. ఈ శిక్షణా శిబిరాల్లో పాల్గొనే వారు ఈశా గ్రామోత్సవంలో భాగస్వాములు కావడానికి అవకాశముంటుంది. విజేతలు రూ.5లక్షల వరకు బహుమతులు గెలుచుకునే అవకాశముంటుందని ఆ సంస్థ పేర్కొంది.