Share News

వాట్సాప్‌లో ఉచితంగా సీనియర్‌ సిటిజన్‌ కార్డులు

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:53 AM

మన మిత్ర’ వాట్సాప్‌ ద్వారా రాష్ట్రంలోని వయోవృద్ధులకు ఉచితంగా సీనియర్‌ సిటిజన్‌ కార్డులు అందిస్తున్నామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

వాట్సాప్‌లో ఉచితంగా సీనియర్‌ సిటిజన్‌ కార్డులు

  • త్వరలో దివ్యాంగులకు రుణ రాయితీ పథకం: మంత్రి డోలా

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ‘మన మిత్ర’ వాట్సాప్‌ ద్వారా రాష్ట్రంలోని వయోవృద్ధులకు ఉచితంగా సీనియర్‌ సిటిజన్‌ కార్డులు అందిస్తున్నామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి అధ్యక్షతన సీనియర్‌ సిటిజన్స్‌ రాష్ట్ర కౌన్సిల్‌ 3వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పలు అంశాలపై సమీక్షించారు. కాగా.. రాష్ట్రంలోని దివ్యాంగులకు త్వరలో రుణ రాయితీ పథకం అమలు చేస్తామని మంత్రి తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి అధ్యక్షతన దివ్యాంగుల రాష్ట్ర సలహా బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగ శక్తి అమలుచేశాం. రాజధాని అమరావతితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో దివ్యాంగ భవన్‌లు నిర్మిస్తాం. దివ్యాంగ లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఫ్లాట్లు కేటాయించనున్నాం’ అని మంత్రి తెలిపారు.

Updated Date - Mar 26 , 2026 | 03:53 AM