నీట్ అభ్యర్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:05 AM
ఈనెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం..
ప్రత్యేక బస్సులు, హెల్ప్ డెస్కుల ఏర్పాటు
విజయవాడ(బ్‌సస్టేషన్), జూన్ 16(ఆంధ్రజ్యోతి): ఈనెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ఏపీఎస్ఆర్‌టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) గద్దె నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్‌ను చూపి తమ నివాస ప్రాంతం నుంచి పరీక్ష కేంద్రానికి, పరీక్ష అనంతరం తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ప్రధాన బస్టాండ్లలో ప్రత్యేక హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేసి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నట్టు పేర్కొన్నారు.