Share News

మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

ABN , Publish Date - Feb 10 , 2026 | 05:23 AM

రాష్ట్రంలో నీట్‌, ఈఏపీ సెట్‌ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

  • నీట్‌, ఈఏపీ సెట్‌ పరీక్షలకు 45 రోజులు శిక్షణ: మంత్రి ఫరూక్‌

అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నీట్‌, ఈఏపీ సెట్‌ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. సోమవారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ నేతృత్వంలో, సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నీట్‌, ఈఏపీ సెట్‌ల పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి వైద్య, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు వీలుగా శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాలతో 45రోజులపాటు అందిస్తామన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన ఉంటుందన్నారు. మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ కోసం సీఈడీఎం వెబ్‌సైట్‌ www.apcedmmwd.org లేదా cedmap2017@gmail.com ఫోన్‌ నంబర్‌-0866- 2970567, మొబైల్‌ నంబర్‌ 7386789966ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

Updated Date - Feb 10 , 2026 | 05:23 AM