13.38 లక్షల మంది కార్మికులకు వైద్య పరీక్షలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:49 AM
భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,38,946 మంది కార్మికులకు వైద్య పరీక్షల నిమిత్తం రూ.349.81 కోట్లు వ్యయం చేయనుంది.
రూ.349 కోట్లతో రెండు విడతల్లో హెల్త్ స్క్రీనింగ్
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,38,946 మంది కార్మికులకు వైద్య పరీక్షల నిమిత్తం రూ.349.81 కోట్లు వ్యయం చేయనుంది. ఈ కార్యక్రమాన్ని టెండర్ ద్వారా ఎంపిక చేసిన సంస్థతో చేపట్టేందుకు అనుమతినిస్తూ కార్మికశాఖ సెక్రటరీ శేషగిరిబాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తొలి ఏడాది 6,69,473 మంది కార్మికులకు స్క్రీనింగ్ చేస్తారు. రెండో ఏడాది 3,15,385 మంది కార్మికులకు స్క్రీనింగ్ చేస్తారు. స్పెషాలిటీ వైద్యుల సమక్షంలో ఫిజికల్ ఎగ్జామినేషన్, బ్లడ్ గ్రూప్, ఊపిరితిత్తుల పనితీరు, చెస్ట్ ఎక్స్‌రే, ఆడియో స్క్రీనింగ్, విజన్ స్క్రీనింగ్, సీబీసీ టెస్ట్, బ్లడ్ షుగర్, కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్ వంటి 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.