స్త్రీ శక్తి బస్సుల్లో దివ్యాంగులకు ఉచితం
ABN , Publish Date - Mar 01 , 2026 | 05:53 AM
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. 40 శాతం, అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని స్పష్టం చేశారు. స్త్రీశక్తి పథకం వర్తించని బస్సుల్లో ఇప్పటికే అమలులో ఉన్న 50శాతం చార్జీ రాయితీ కొనసాగుతుంది. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.