వితంతువులే టార్గెట్!
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:31 AM
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా వితంతువులకు వల వేసి.. బంగారు ఆభరణాల తో ఉడాయించే చిత్తూరు జిల్లా కు చెందిన అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు.
పెళ్లి పేరుతో వల.. బంగారంతో జంప్
అంతర్రాష్ట్ర కేటుగాడి అరెస్టు
340 గ్రాముల బంగారం, 75 లక్షల నగదు స్వాధీనం
రాజమహేంద్రవరం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా వితంతువులకు వల వేసి.. బంగారు ఆభరణాల తో ఉడాయించే చిత్తూరు జిల్లా కు చెందిన అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం తూ ర్పు గోదావరి పోలీసులకు చిక్కి న ఇతడి నేరాల చిట్టాను డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు. పెళ్లిళ్ల పేరుతో నమ్మించి బంగారు ఆభరణాలు, కార్లు దొంగిలిస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పి.వడ్డూరు గ్రామానికి చెందిన చల్లా నారాయణ(కృష్ణ నారాయణ, నారాయణ కృష్ణ, కృష్ణప్ప)ను అరెస్టు చేశామని చెప్పారు. భర్త మరణించి రెండో వివా హం నిమిత్తం మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో వివరాలు నమో దు చేసుకున్న వాళ్లతో ఫోన్ ద్వారా నారాయణ మాటలు కలుపుతాడు. మారు పేర్లతో వాట్సా్‌పలో చాటింగ్ ఆరంభిస్తాడు. ఒంటినిండా నకిలీ బంగారు ఆభరణాలు ధరించి ధనికుడిలా ఫొటోలు పంపిస్తాడు. అవతలవైపు నుంచి కొద్దిగా చొరవ కనబడిన తర్వాత.. మీ ప్రొఫైల్ మా తల్లిదండ్రులకు చూపించాను. మీరు బాగా నచ్చారని, అయితే మీ జాతకంలో కొద్దిగా దోషం ఉందని ఆమెతో చెబుతాడు. రాజమహేంద్రవరం వచ్చి గోదావరిలో స్నానమాచరించి దోష నివారణకు పూజలు చేస్తే సరిపోతుందంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని, మంచి చీర, బంగారు ఆభరణాలు ధరించి రావాలని సూచిస్తాడు. అలా హైదరాబాద్, విశాఖపట్నం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు చెందిన మహిళలను రాజమహేంద్రవరం రప్పించాడు. వాళ్లను కారులో పుష్కర ఘాట్ లేదా కోటిలింగాల ఘాట్‌కి తీసుకెళ్లి స్నానం చేయడానికి ముందు బంగారు ఆభరణాలు బ్యాగ్‌లో పెట్టుకోమని సలహా ఇస్తాడు. వాళ్లు స్నానం చేసి వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకొనే గదిలోకి వెళ్లే సమయంలో.. పూజ సామగ్రి తీసుకొస్తానని చెప్పి బంగారు ఆభరణాల బ్యాగ్ తో ఉడాయిస్తాడు.
ఇలా ఇద్దరికి చెందిన వేగనార్, ఇన్నోవా కార్లను దొంగిలించాడు. ఈ ఘటనలపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో 5 కేసులు నమోదయ్యాయని డీఎస్పీ చెప్పారు. ఫోన్ ద్వారా నారాయణను ట్రాఫ్ చేసి రాజమహేంద్రవ రం రప్పించి శనివారం అరెస్టు చేశామన్నారు. త్రీటౌన్‌లో నమోదైన కేసులకు సంబంధించి 340 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.75 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. నారాయణపై చిత్తూరు, తిరుమల, అలిపిరి, పలమనేరు, విశాఖపట్నం, నెల్లూరు, కర్నాటకలో ని చిక్‌బళ్లాపూర్‌లలో పోక్సో, హత్య, దోపిడీ తదితర నేరాలకు సంబంధించి 2018 నుంచి 8 కేసులు ఉన్నాయన్నా రు. అతడిపై పలమనేరు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటు కూ డా ఉందని తెలిపారు. నారాయణ వల్ల మోసపోయిన వా ళ్లు ఇంకా ఎవరైనా ఉంటే పోలీసులను ఆశ్రయించి వివరా లు తెలియ జేయాలని సూచించారు. కేసుల దర్యాప్తులో ప్రతిభ చూపిన సీఐ వి.అప్పారావు, ఎస్‌ఐలు వి.యేసేబు, బి.సురేశ్, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు వి.కృష్ణ, రామయ్యలకు రివార్డులు ప్రకటించారని డీఎస్పీ చెప్పారు.