బంగారం పేరిట మోసం
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:28 PM
సగం ధరకే బంగారం ఇస్తామని కర్ణాటకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వ్యక్తిని మోసం చేసినట్లు సీఐ రాముడు తెలిపారు.
ఎమ్మిగనూరు టౌన, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): సగం ధరకే బంగారం ఇస్తామని కర్ణాటకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వ్యక్తిని మోసం చేసినట్లు సీఐ రాముడు తెలిపారు. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన నరేశకుమార్ను సగం ధరకే బంగారం ఇస్తామని కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా తురకడోన గ్రామానికి చెందిన వీరేశయ్య, తుంగభద్ర గ్రామానికి చెందిన రాజు, ఈరన్నలు నమ్మించారు. అంతేకాకుండా అడ్వాన్సగా రూ.50వేలు తీసుకున్నారు. ఆ సమయంలో కొంత బంగారం ఇచ్చి 20 రోజులకు మరో రూ.4.50 లక్షలు ఇస్తే వంద తులాలు బంగారం ఇస్తామని ఆశ చూపారు. అనుకున్నట్లుగానే పట్టణంలోని ఉప్పర కొట్టాల దగ్గర వారు కలుసుకున్నారు. ఆ సమయంలో బంగారానికి బదులుగా నకిలీ వజ్రాలను కర్ణాటక ముఠా సభ్యులు చూపించారు. వాటిని చూసిన నరేశ కుమార్.. నకిలీవి ఇస్తారా? అంటూ ప్రశ్నించాడు. రూ.4.50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామంటూ నిందితులు బెదిరించారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు నరేశ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.