ఆవు దూడపై లైంగిక దాడి
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:58 AM
ఆవుదూడపై లైంగిక దాడి చేశారంటూ 17 ఏళ్ల లోపు వయసున్న నలుగురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో నలుగురు బాలురు
ములకలచెరువు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఆవుదూడపై లైంగిక దాడి చేశారంటూ 17 ఏళ్ల లోపు వయసున్న నలుగురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని ఒక గ్రామంలో ఈ నెల 11న ఈ సంఘటన జరిగింది. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. కాగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం బురకాయలకోటలో ముంబై-చెన్నై రహదారిపై హిందూ సమ్మేళనం నాయకుడు విజయకుమార్, బీజేపీ నేతలు గోపాలరెడ్డి, మంగరాజు, ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. బాలురను శనివారం తిరుపతి కోర్టులో హాజరుపరచనున్నారు. సీఐ వెంకటేశులు, ఎస్‌ఐ ప్రతాప్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.