Sri Sathya Sai District: కేక్ తిని 40 మంది చిన్నారులకు అస్వస్థత
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:07 AM
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి తోపాటు కొత్తచెరువు మండల కేంద్రంలో నూతన సంవత్సరాది సందర్భంగా కేక్ తిన్న...
కొత్తచెరువు, జనవరి 1(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి తోపాటు కొత్తచెరువు మండల కేంద్రంలో నూతన సంవత్సరాది సందర్భంగా కేక్ తిన్న 40 మంది చిన్నారులు అస్వస్థతకు లోనయ్యారు. కడుపునొప్పి, వాంతులతో గురువారం రాత్రి ఆస్పత్రుల పాలయ్యారు. కొత్తచెరువులో గత నెల 31 రాత్రి విద్యార్థులు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్‌లు కోశారు. వాటిని తిన్న 25 మంది చిన్నారులకు కాసేపటికే కడుపునొప్పితోపాటు వాంతులు కావడంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. కొత్తచెరువు నుంచి కేక్‌లు పుట్టపర్తికి తీసుకెళ్లిన 15 మంది చిన్నారులు కూడా అస్వస్థతకు గురైనట్టు సమాచారం.