Share News

బీఆర్‌ నాయుడుతో రాజీనామా చేయించాలి

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:06 AM

ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెంకటేశ్వరస్వామి మీద దైవభక్తి నిజమైతే అశ్లీల వీడియోతో దొరికిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును తక్షణమే రాజీనామా చేయించాలని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

బీఆర్‌ నాయుడుతో రాజీనామా చేయించాలి

  • టీటీడీ చైర్మన్‌ పదవికి అనర్హుడు: భూమన

అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెంకటేశ్వరస్వామి మీద దైవభక్తి నిజమైతే అశ్లీల వీడియోతో దొరికిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును తక్షణమే రాజీనామా చేయించాలని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్‌ పదవికి అనర్హుడని అన్నారు. ఆదివారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సానుకూల మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను పవనానంద స్వాము లూ అని సంబోధిస్తూ.. బీఆర్‌ను ఎలా సమర్థిస్తారని సమాజం ప్రశ్నిస్తోందన్నారు. బీఆర్‌ నాయుడును ముఖ్యమంత్రి ఎలా క్షమిస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ అనైతిక చర్యల గురించి వైసీపీ మొదటి నుంచి హెచ్చరిస్తోందని అన్నారు. ఏడాదిన్నరగా ఆధారాలు చూపిస్తున్నా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. డీప్‌ఫేక్‌ వీడియోలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారని, బీఆర్‌ను కాపాడాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ తప్పునకు భవిష్యత్తులో చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. దేవుడికి సేవచేసే అవకాశం వస్తే ఆలయంలో బీఆర్‌ నాయుడు రాజకీయాలు చేశారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణిపై వేసిన నిందకు బీఆర్‌ నాయుడుకు దేవుడు వేసిన శిక్ష ఇది అని భూమన అన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 04:07 AM