మత మార్పిళ్లతో హిందూ ధర్మానికి నష్టం
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:58 AM
హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోకుంటే.. భారత్ మరో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌గా మారిపోయే ప్రమాదం ఉందని వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి...
రెడ్డి సామాజికవర్గ సమావేశంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
తిరుపతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోకుంటే.. భారత్ మరో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌గా మారిపోయే ప్రమాదం ఉందని వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలో నిర్వహించిన హిందూ ధర్మ పరిరక్షణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రెడ్డి అనుబంధ సామాజిక వర్గీయులు పాల్గొన్న ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మత మార్పిడులను వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. మత మార్పిళ్లతో హిందూ ధర్మానికి నష్టమని హెచ్చరించారు. ‘హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రెడ్డి సామాజిక వర్గంపై ఉంది. మత మార్పిడిలను నిలువరించి, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ ఉంది. నా వంతుగా అందరితో కలసి అడుగులు వేస్తాను. ఎల్లవేళలా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు కష్టపడతానని దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ చెబుతున్నాను’ అని అన్నారు.