Share News

Former MLA: మాజీ ఎమ్మెల్యే సుమన కన్నుమూత

ABN , Publish Date - Jan 03 , 2026 | 05:41 AM

పాయకరావుపేట మాజీ శాసనసభ్యురాలు గంటెల సుమన (67) కన్నుమూశారు. ఆమె 1983 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని...

Former MLA: మాజీ ఎమ్మెల్యే సుమన కన్నుమూత

విశాఖపట్నం/నక్కపల్లి/పాయకరావుపేట, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట మాజీ శాసనసభ్యురాలు గంటెల సుమన (67) కన్నుమూశారు. ఆమె 1983 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట (ఎస్సీ రిజర్వుడ్‌) నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా విజయం సాధించారు. పార్టీలో సంక్షోభం తలెత్తినప్పుడు నాదెండ్ల పక్షాన నిలిచారు. ఆ తరువాత రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థినిగా మూడుసార్లు, ఇండిపెండెంట్‌గా ఒకసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సుమనకు బ్రెయిన్‌ స్ర్టోక్‌ రావడంతో పదిహేను రోజుల క్రితం కుటుంబ సభ్యులు రామ్‌నగర్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆమె మృతి పట్ల హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సంతాపం తెలిపారు.

Updated Date - Jan 03 , 2026 | 05:41 AM