మాజీ మంత్రి ముద్రగడకు అస్వస్థత
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:18 AM
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి శనివారం అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
కిర్లంపూడి, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి శనివారం అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి పది గంటలకు రూమ్‌కి షిఫ్ట్ చేసినప్పటికీ శనివారం మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. శనివారం రాత్రి సమీపంలోని అంజూ ఆసుపత్రికి మార్చి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని బంధువులు, ఆయన అనుచరులు పలువురు హైదరాబాద్ పయనమై వెళ్లారు.