రూల్స్ ఉల్లంఘన.. ప్రజలకు అసౌకర్యం
ABN , Publish Date - Feb 08 , 2026 | 05:02 AM
మాజీ మంత్రి జోగి రమే్‌షపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ ర్యాలీ సందర్భంగా నిబంధనలు...
మాజీ మంత్రి జోగి రమే్‌షపై కేసు
విజయవాడ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జోగి రమే్‌షపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ ర్యాలీ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి, ప్రజలకు అసౌకర్యం కలిగించారని ఈ కేసు నమోదు చేశారు. టీడీపీ శ్రేణులు జోగి ఇంటిపై దాడి చేయడంతో జగన్ శుక్రవారం పరామర్శకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలకడానికి, తన బలాన్ని చూపించడానికి జోగి జనసమీకరణ చేశారు. యువకులు రహదారులపై ద్విచక్రవాహనాలతో ప్రమాదకర స్టంట్లు వేశారు. ర్యాలీలు నిర్వహించి వాహనదారులు, ప్రజలకు అసౌకర్యం కలిగించారు. దీనిపై ఎస్‌ఐ రవివర్మ చేసిన ఫిర్యాదుపై పోలీసులు క్రైం నంబరు76/2026తో బీఎన్‌ఎస్ 223, 189(2), 292, 125(2), 126(2), 132 రెడ్‌విత్ 190, పోలీసు చట్టంలోని 32, క్రిమినల్ లా అమెండ్‌మెంట్ చట్టంలోని 7(1)(ఎ), 188, 143, 290, 336, 341, 353 రెడ్‌విత్ 149 కింద కేసు నమోదు చేశారు.