Share News

Health Condition: మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం

ABN , Publish Date - Jan 12 , 2026 | 06:22 AM

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Health Condition: మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం

  • ఇంట్లో కాలుజారి పడటంతో తీవ్ర గాయాలు.. ఐసీయూలో చికిత్స

శ్రీకాకుళం, జనవరి 11(ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఆయన అరసవల్లిలోని తన నివాసంలో కాలుజారి పక్కకు తూలి కిందపడిపోయారు. గాయాలపాలైన ఆయనను కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని బగ్గు సరోజినీ దేవి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. 2024 సెప్టెంబరులో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. వయోభారం, తాజా గాయాల నేపథ్యంలో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కాగా గుండ అప్పల సూర్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని ఆయన సతీమణి, మాజీఎమ్మెల్యే లక్ష్మీదేవి వెల్లడించారు.

Updated Date - Jan 12 , 2026 | 06:22 AM