Share News

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:44 AM

వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఆత్మహత్యాయత్నం కేసులో ఆయనకు జైలు శిక్షతోపాటు....

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు

  • ఆత్మహత్యాయత్నం కేసులో రైల్వే కోర్టు తీర్పు

మహారాణిపేట (విశాఖపట్నం), ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఆత్మహత్యాయత్నం కేసులో ఆయనకు జైలు శిక్షతోపాటు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది. 2016 ఏప్రిల్‌లో ఆయన విశాఖలో రైల్వే జోన్‌ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను కేజీహెచ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆత్మహత్యాయత్నం నేరం కింద అప్పటి టూటౌన్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. నేరం రుజువు కావడంతో రైల్వే కోర్టు అడిషనల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ వరలక్ష్మి శుక్రవారం తీర్పు వెలువరించారు.

Updated Date - Apr 11 , 2026 | 03:44 AM