మాజీ మంత్రి అప్పలనరసింహరాజు కన్నుమూత
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:43 AM
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మాజీ శాసనసభ్యుడు రాజా సాగి దేవీ ప్రసన్న అప్పలనరసింహరాజు ...
భీమిలి నుంచి వరుసగా నాలుగుసార్లు శాసనసభకు ఎన్నిక
పద్మనాభం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మాజీ శాసనసభ్యుడు రాజా సాగి దేవీ ప్రసన్న అప్పలనరసింహరాజు (ఆర్‌ఎస్డీపీఏఎన్ రాజు) (80) బుధవారం తెల్లవారుజామున పద్మనాభం మండలం పాండ్రంగిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆర్‌ఎ్‌సడీపీఏఎన్ రాజు 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988లో ఏడాదిన్నరపాటు ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సహా పలువురు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.