Share News

రేప్‌ కేసులో లొంగిపోయిన చిన్నమల్లయ్య

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:42 AM

మహిళపై అత్యాచారానికి పా ల్పడిన కేసులో మాజీ సీఐ చిన్నమల్లయ్య శనివారం తెల్లవారుజామున పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.

రేప్‌ కేసులో లొంగిపోయిన చిన్నమల్లయ్య

కోర్టుకు హాజరు.. 14 రోజుల రిమాండ్‌

వినుకొండటౌన్‌/చిలకలూరిపేట, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): మహిళపై అత్యాచారానికి పా ల్పడిన కేసులో మాజీ సీఐ చిన్నమల్లయ్య శనివారం తెల్లవారుజామున పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ
పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసిన అనంతరం.. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, చిలకలూరిపేట ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తునకు సంబంధించిన నివేదికలు, ఆధారాలను సమర్పించారు. కేసు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి నరేంద్రరెడ్డి.. చిన్నమల్లయ్యకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు భారీ బందోబస్తు మధ్య నిందితుడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఏప్రిల్‌ 29న బ్రాహ్మణపల్లిలో చిన్నమల్లయ్యకు చెందిన ఫాంహౌస్ లో కోళ్ల ఫారం నిర్వహిస్తున్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో చిన్న మల్లయ్యపై వినుకొండ పట్టణంలో కేసు నమోదైంది. ఈ క్రమంలో నిందితుడు అజ్ఞాతంలో ఉంటూ.. బెయిల్‌ కోసం కోర్టుల్లో ప్రయత్నాలు చేశాడు. అయితే ఎక్కడా ఊరట దక్కకపోవడంతో పోలీసుల ముందు లొంగిపోక తప్పని పరిస్థితి నెలకొంది.

Updated Date - Jun 07 , 2026 | 05:45 AM