Share News

బొగ్గు కోసం నిప్పు

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:24 AM

విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం బొడ్డవర సమీపంలో వందల ఎకరాల విస్తీర్ణంలో అడవులు, కొండలు ఉన్నాయి. ఇక్కడ వెదురు, గండ్ర, వేప, తుమ్మ వంటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి.

బొగ్గు కోసం నిప్పు

విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం బొడ్డవర సమీపంలో వందల ఎకరాల విస్తీర్ణంలో అడవులు, కొండలు ఉన్నాయి. ఇక్కడ వెదురు, గండ్ర, వేప, తుమ్మ వంటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని కాల్చి.. బొగ్గు చేసుకోడానికి గురువారం రాత్రి స్మగ్లర్లు ఈ కొండకు నిప్పు పెట్టారు. అడవికి నిప్పంటుకున్న దృశ్యం సుదూర ప్రాంతానికి కనిపించింది. ఏటా ఇక్కడి కొండలకు స్మగ్లర్లు నిప్పు పెడుతుంటారని, అయితే ఈసారి మరింత ఎక్కువగా మంటలు కనిపించాయని స్థానిక పర్యావరణవేత్త బొబ్బిలి రామకృష్ణ చెప్పారు. చెట్లు కాలిపోయిన తర్వాత స్మగ్లర్లు బొగ్గు సేకరించి విజయనగరం, విశాఖపట్నానికి తరలించి విక్రయిస్తుంటారు. గ్యాస్‌ కొరతతో ప్రస్తుతం బొగ్గుకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఒక్కో బస్తా రూ.600 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది.

- ఎస్‌.కోట రూరల్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 04 , 2026 | 03:24 AM