ఆసుపత్రి అభివృద్ధికి ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:00 AM
ఆదోనిలోని మాతా శిశు సంరక్షణ(ఎంసీహెచ్) ఆసుపత్రి అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు.
ఎంసీహెచ్ అభివృద్ధికి
రూ.2.58 కోట్ల ప్రతిపాదనలు
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ
సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారథి
లక్ష్యానికి మించి కాన్పులు
సూపరింటెండెంట్
డాక్టర్ మధుసూదన్‌రెడ్డి
ఆదోని, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఆదోనిలోని మాతా శిశు సంరక్షణ(ఎంసీహెచ్) ఆసుపత్రి అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో ఎంసీహెచ్ ఆసుపత్రి కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి అభివృద్ధికి రూ.2.58 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడు తూ ఫిబ్రవరిలో ఆసుపత్రి సాధించిన ప్రగతిని వివరించారు. 50 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో గత నెలలో ఏకంగా 401 కాన్పులు జరిగాయని వెల్లడించా రు. ఇందులో 130 సిజేరియన్లు కాగా, మిగిలినవి సాధారణ ప్రసవాలని పేర్కొన్నారు. సిబ్బంది కొర త ఉన్నప్పటికీ, లక్ష్యానికి మించి సేవలందిస్తున్నారని కొనియాడారు. ఆసుపత్రిలో ఎదురవుతున్న పలు సమస్యలను కమిటీ దృష్టికి సూపరింటెండెంట్ తీసుకొచ్చారు. తాగునీటి సమస్యతో పాటు సంపు మరమ్మతులు చేపట్టాలన్నారు. రోగుల సహాయకుల కోసం ప్రత్యేకంగా షెడ్డు నిర్మించాలని, భద్రత కోసం సీసీ కెమెరాలు, పాత భవనానికి విద్యుత్ మరమ్మతులు అవసరమన్నారు. అంతర్గత రోడ్లు, వాహనాల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని, 50 పడకల కొత్త బిల్డింగ్ పూర్తిస్థాయి వినియోగం కోసం అదనపు సిబ్బందిని కేటాయించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ నిత్యం 200 నుంచి 250 మంది వరకు రోగులు వస్తున్నారని, ప్రస్తుతానికి 75 బెడ్లు అడ్జస్ట్ చేసి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వై ద్యుల పోస్టులు 6, నర్సింగ్ పోస్టులు 15 భర్తీపై జిల్లా కో ఆర్డినేటర్ జఫరుల్లాతో ఫో న్‌లో మాట్లాడనన్నారు. సమావేశంలో ఎం పీడీవో నాగరాజు, కమిటీ సభ్యులు రేణువ ర్మ, దేశాయి చంద్రన్న, కౌన్సిలర్ లలితమ్మ, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.