Share News

అలిపిరిలో కుప్పలుగా పాదరక్షలు

ABN , Publish Date - Jun 14 , 2026 | 05:09 AM

అలిపిరిలో పాదాల మండపం సమీపాన పాదరక్షలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. అలిపిరి మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులతో పాటు వాహనాల్లో తిరుమలకు..

అలిపిరిలో కుప్పలుగా పాదరక్షలు

తిరుమల, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): అలిపిరిలో పాదాల మండపం సమీపాన పాదరక్షలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. అలిపిరి మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులతో పాటు వాహనాల్లో తిరుమలకు వెళ్లే భక్తులు కూడా అలిపిరి వద్దనే పాదరక్షలను విడిచిపెడుతున్నారు. ఈ క్రమంలో పాదరక్షలు పేరుకుపోయి గుట్టలుగా కన్పిస్తున్నాయి. లగేజీ ద్వారా పాదరక్షలు పంపేందుకు, పాదరక్షలు ధరించి నడిచే అవకాశమున్నా, భక్తులు సెంటిమెంట్‌గా కొండ కిందనే తమ పాదరక్షలు వదిలేస్తున్నారు. ఫలితంగా అలిపిరి మెట్లమార్గం ప్రవేశమంతా చెప్పులతో దర్శనమిస్తోంది. పారిశుధ్య కార్మికులు వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. మరోవైపు దర్శనం పూర్తి చేసుకుని తిరిగి అలిపిరికి చేరుకున్న కొందరు భక్తులు తమ పాదరక్షల కోసం వెతుకుతూ కనిపిస్తున్నారు.

Updated Date - Jun 14 , 2026 | 05:10 AM