Share News

తనిఖీలు చేస్తున్నారా?

ABN , Publish Date - Mar 14 , 2026 | 03:50 AM

‘అసలు మీరు తనిఖీలు చేస్తున్నారా? ఆహార నమూనాలు సేకరిస్తున్నారా?’ అని ఫుడ్‌ సేఫ్టీ అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రశ్నించారు.

తనిఖీలు చేస్తున్నారా?

  • ఆహార నమూనాలు సేకరిస్తున్నారా: సత్యకుమార్‌

అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ‘అసలు మీరు తనిఖీలు చేస్తున్నారా? ఆహార నమూనాలు సేకరిస్తున్నారా?’ అని ఫుడ్‌ సేఫ్టీ అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 20 శాతం వరకూ నాణ్యత లేదని నిర్ధారణ అవుతోందన్నారు. ఏపీలో మాత్రం ఇది 8 శాతమే ఉందని, ఇంత వ్యత్యాసం ఉండడంలో ఆంతర్యమేమిటని అధికారులను నిలదీశారు. శుక్రవారం మంగళగిరిలోని సెకండరీ హెల్త్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో ఫుడ్‌ సేఫ్టీ విభాగంపై ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్రం 2024లో ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఏపీ 28వ స్థానంలో ఉందని తెలిపారు.

Updated Date - Mar 14 , 2026 | 03:51 AM