సేవాభావంతో అన్నదానసత్రాలు నడపాలి
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:38 PM
శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు సేవాభావంతో నిత్యాన్నదాన సత్రాలు నడిపించాలని ఈవో శ్రీనివాసరావు కోరారు.
-తిరుమల తిరుపతి తరహాలో జరిగే అభివృద్ధిలో భాగం కండి
- ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు సేవాభావంతో నిత్యాన్నదాన సత్రాలు నడిపించాలని ఈవో శ్రీనివాసరావు కోరారు. శనివారం శ్రీశైల క్షేత్రంలోని నిత్యాన్నదాన సత్రాలు, ఆశ్రమాలు, పీఠాలు, మఠాలు, సేవాసదనాల నిర్వాహకులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర పరిధిలో భక్తులు బస చేసే వసతి సముదాయాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడంలో భాగంగా నిరంతరం శివపంచాక్షరీ మంత్రం, శ్రీమాతే నమ: వంటి చాంటింగ్‌లతోపాటు సాయంకాలాల్లో ప్రవచనాలు, పారాయణలు, సత్సంగ కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యాలని సూచించారు. శ్రీశైల క్షేత్రం భవిష్యత్తులో తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ అందులో భాగం కావాలని అన్నారు. ఈ సమావేశంలో పీఆర్‌వో శ్రీనివాసరావు, ఏఈవో శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షకులు ఎమ్‌ఎస్, ఎడిటర్ అనీల్‌కుమార్, సత్రం మేనేజర్లు, శివకుమార్, మదురవాణి, శ్రీలక్ష్మి, శ్రీధర్‌శర్మ, శివకుమార్‌గౌడ్‌లతోపాటు సుమారు 65 నిత్యాన్నదాన సత్రాల నిర్వాహకులు హాజరయ్యారు.