Weather Alert: పలు జిల్లాలకు పొగమంచు హెచ్చరిక
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:42 AM
కోస్తాలోని పలు జిల్లాల్లో ఆదివారం పొగమంచు దట్టంగా కురిసింది. రెండు, మూడు రోజుల వరకు పొగమంచు తీవ్రత...
రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత
విశాఖపట్నం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కోస్తాలోని పలు జిల్లాల్లో ఆదివారం పొగమంచు దట్టంగా కురిసింది. రెండు, మూడు రోజుల వరకు పొగమంచు తీవ్రత కొనసాగనున్నట్టు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరిక జారీచేసింది. పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాలు, కోస్తాలో మిగిలిన జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పొగమంచు కురిసింది. దీంతో ఆదివారం ఉదయం విజిబిలిటీ 500 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. కాగా... ఆదివారం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 3.5 డిగ్రీలు, సముద్రతీర ప్రాంతమైన కళింగపట్నంలో 12.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.