కోస్తాలో పొగమంచు
ABN , Publish Date - Jan 28 , 2026 | 07:10 AM
కోస్తాలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం పొగమంచు కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకూ పార్వతీపురం మన్యం, విజయనగరం...
విశాఖపట్నం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): కోస్తాలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం పొగమంచు కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకూ పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఎక్కువచోట్ల, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పొగ మంచు ప్రభావం కనిపించింది. ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి గాలులు వీచాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కోస్తాలో సాధారణం కంటే తక్కువగా, రాయలసీమలో సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో అక్కడక్కడ పొగ మంచు ప్రభావం ఉంటుందని, ఇతర ప్రాంతాల్లో పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.