Share News

ఫ్లైఓవర్‌ పనులు త్వరలో చేపడుతాం: రైల్వే జీఎం

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:03 AM

ప్లైఓవర్‌ మంజూరు అయిందని, త్వరలో పనులు చేపడుతామని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్‌కుమార్‌ శ్రీ వాత్సవ అన్నారు.

ఫ్లైఓవర్‌ పనులు త్వరలో చేపడుతాం: రైల్వే జీఎం

పాణ్యం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : ప్లైఓవర్‌ మంజూరు అయిందని, త్వరలో పనులు చేపడుతామని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్‌కుమార్‌ శ్రీ వాత్సవ అన్నారు. మంగళవారం పాణ్యం వద్ద గుంతకల్లు, గుంటూరు డబ్లింగ్‌ పనులను, స్టేషన సమీపంలోని వద్దెలవాగు వంతెనను, రైల్వే స్టేషనలోని పనులను పరిశీలించారు. రెండవ రైల్వే మార్గం, విద్యుత పనులు, స్టేషనలోని ప్రయాణీకుల సౌకర్యాలపై చర్చించారు. గ్రామస్థులు ఆయనకు పలు సమస్యల వినతి పత్రం అందజేశారు. ఔరంగాబాద్‌, గుంటూరు, కాచిగూడ రైళ్లను పాణ్యంలో నిలపాలని, పాణ్యంలో రిజర్వేషన కౌంటర్‌ ఏర్పా టు చేయాలని కోరారు. దీనికి ఆయన మాట్లాడుతూ ఈసమస్యలను పరిశీలిస్తామన్నారు. వాహనాల రద్దీ పెరిగడంతో పలుమార్లు పా ణ్యంలో రైల్వే గేటు వేయడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రజల కోరిక మేరకు ఫ్లైఓవర్‌ మంజూరైందని త్వరలో పను లు చే పట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 12:03 AM