Krishna River Tourism: కృష్ణానదిలో ఫ్లోటెడ్ హౌస్ బోట్స్
ABN , Publish Date - Jan 09 , 2026 | 06:01 AM
కృష్ణానదిలో పర్యాటకులు సకుటుంబ సమేతంగా విహరించటానికి వీలుగా ఫ్యామిలీ ఫ్లోటెడ్ హౌస్ బోట్లను యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే...
ఈయూ రాయబారితో కలిసి రెండు బోట్లు ప్రారంభించిన సీఎం
ఫ్యామిలీ డిన్నర్ కోసం.. మూన్‌లైట్ పంటు పరిశీలన
విజయవాడ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదిలో పర్యాటకులు సకుటుంబ సమేతంగా విహరించటానికి వీలుగా ఫ్యామిలీ ఫ్లోటెడ్ హౌస్ బోట్లను యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫిన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. పీపీపీ విధానంలో ఫ్లోటెడ్ హౌస్‌బోట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, సింపుల్ ఇండియా సంస్థ.. కేరళ తరహా రెండు విభిన్న హౌస్‌బోట్లను రూపొందించింది. కృష్ణానదిలో ఇటీవల ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ రెండింటితో పాటు, కృష్ణానదిలో మూన్‌లైట్ డిన్నర్‌కు వీలుగా రూపొందించిన పంటును కూడా ప్రారంభించారు. ఈయూ రాయబారితో కలిసి హౌస్‌బోట్లను, అందులోని సౌకర్యాలను సీఎం పరిశీలించారు. మూన్‌లైట్ డిన్నర్ ఫంటులో కూర్చుని ఈయూ రాయబారితో దీని విశేషాలను పంచుకున్నారు.