Share News

Flamingo Festival: పక్షుల పండుగ.. అదరహో!

ABN , Publish Date - Jan 12 , 2026 | 06:38 AM

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా జరుగుతున్న పక్షుల పండుగ(ఫ్లెమింగో ఫెస్టివల్‌)కు రెండో రోజైన ఆదివారం సందర్శకులు పోటెత్తారు.

Flamingo Festival: పక్షుల పండుగ.. అదరహో!

తడ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా జరుగుతున్న పక్షుల పండుగ(ఫ్లెమింగో ఫెస్టివల్‌)కు రెండో రోజైన ఆదివారం సందర్శకులు పోటెత్తారు. భీములవారిపాళెం పడవలరేవుకు, నేలపట్టు పక్షుల కేంద్రానికి, అటకానితిప్ప వద్ద పులికాట్‌ సరస్సును తిలకించేందుకు వచ్చారు. నేలపట్టు వద్ద పక్షుల వీక్షణకు సినీ నటుడు మంచు విష్ణు కుటుంబ సభ్యులతో వచ్చారు. ఇక, పడవ షికారుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

Untitled-2 copy.jpg

Updated Date - Jan 12 , 2026 | 06:40 AM