Sullurupeta: పక్షుల పండుగ పిలుస్తోంది!
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:21 AM
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పక్షుల పండుగ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఎమ్మెల్యే..
ఇంటర్నెట్ డెస్క్: తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పక్షుల పండుగ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ప్రారంభించారు. అనంతరం స్టాళ్లను ప్రారంభించారు. భీములవారిపాళెం పడవల రేవులో పడవ షికారుకు పచ్చజెండా ఊపారు. నేలపట్టు, అటకానితిప్పలో పక్షులను చూసేందుకు సందర్శకులు తరలివచ్చారు. తొలిరోజు పడవ షికారు, పక్షుల వీక్షణకు జనం ఆసక్తి చూపారు. చలిగాలులు, వర్షంతో పర్యాటకులు ఇబ్బందిపడ్డారు. ఉదయం సూళ్లూరుపేటలో శోభాయాత్ర నిర్వహించారు. సూళ్లూరుపేట, సర్వేపల్లి ఎమ్మెల్యేలు విజయశ్రీ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
- ఆంధ్రజ్యోతి, సూళ్లూరుపేట