ఐదుగురిపై జిల్లా బహిష్కరణ వేటు
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:20 AM
జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఐదుగురు రౌడీ షీటర్లపై జిల్లా బహిష్కరణ వేటు వేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు క్రైం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఐదుగురు రౌడీ షీటర్లపై జిల్లా బహిష్కరణ వేటు వేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన పరిధిలో షరీననగర్‌లో నివాసముంటున్న రౌడీషీటర్లు వడ్డె రామాంజనేయులు అలియాస్ వడ్డె అంజి, వడ్డె తులసి కుమార్, వడ్డె రేవంత కుమార్, వడ్డె శివకుమార్‌లతో పాటు సస్పెక్ట్ షీటర్ పఠాన ఇమ్రాన ఖానలపై జిల్లా బహిష్కరణ వేటు వేశారు. వడ్డె రామాంజనేయులు అలియాస్ వడ్డె అంజిపై జిల్లాలోని వివిద పోలీస్ స్టేషనల్లో 17కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వడ్డె రేవంత కుమార్, వడ్డె శివకుమార్, వడ్డె తులసి కుమార్‌లపై 5 కేసులు ఉన్నాయి. సస్పెక్ట్ షీటర్ పఠాన ఇమ్రాన ఖానపై 19 క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. వీరిలో హత్యలు, దోపిడీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల మీద దాడులు, జులుం కేసులు, హత్యాయత్నం కేసులు ఇలా పలు రకాల కేసులు ఉన్నాయి. పలుమార్లు వీరిపై తెలిపిన కేసుల్లో రిమాండ్‌కు వెళఙ్లనా కూడా వారిలో ఎటువంటి మార్పు రాకపోవడం, అదే విదంగా 2022లో వడ్డె ఆంజనేయులు, ఇమ్రానఖానలు పీడీ యాక్టు నిర్బంధ ఉత్తర్వుల కింద కడప సెంట్రల్ జైలులో ఖైదు చేయబడినప్పటికీ వీరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పలు రకరకాల కేసులలో పాల్గొంటున్నారనీ జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ ప్రతిపాదనల మేరకు వారిద్దరి యొక్క క్రిమినల్ రికార్డులను నిశితంగా పరిశీలించిన కలెక్టర్ డా.ఏ.సిరి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ విక్రాంత పాటిల్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా బహిష్కరణతో పాటు పీడీ యాక్టు కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. చెడు నడత కలిగిన మరి కొందరిపై కూడా జిల్లా బహిష్కరణ గురించి పరిశీలనలో ఉన్నాయనీ ఆయన తెలిపారు.