Share News

విశాఖ తీరాన మరో బోటు బోల్తా..ఇద్దరు మత్స్యకారులకు గాయాలు

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:51 AM

విశాఖ సాగర తీరాన గురువారం మరో మత్స్యకారుల బోటు బోల్తాపడింది. వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన పలువురు మత్స్యకారులు రెండుబోట్లలో వేర్వేరుగా..

విశాఖ తీరాన మరో బోటు బోల్తా..ఇద్దరు మత్స్యకారులకు గాయాలు

విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): విశాఖ సాగర తీరాన గురువారం మరో మత్స్యకారుల బోటు బోల్తాపడింది. వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన పలువురు మత్స్యకారులు రెండుబోట్లలో వేర్వేరుగా గురువారం ఉదయం 4.30 గంటల సమయంలో సముద్రంలో వేటకు వెళ్లారు. వలను లాగుతుండగా పెద్ద అల వచ్చి కొట్టడంతో బోటు బోల్తా పడి, రాళ్ల మధ్య చిక్కుకుంది. ఆ ధాటికి తిక్కాడ తాతారావు (25), గనగళ్ల ఆకాశ్‌ (20) రాళ్లకు గీసుకోవడంతో గాయాలపాలయ్యారు. వారిని తోటి మత్స్యకారులు రక్షించారు. విషయం తెలిసిన వెంటనే హోం మంత్రి అనిత స్పందించి, వారికి తక్షణ వైద్యం అందించాలని ఆదేశించడంతో కేజీహెచ్‌లో చేర్పించారు. స్వల్పగాయాలే కావడంతో చికిత్స అనంతరం వారిని ఇంటికి పంపించేశారు.

Updated Date - Jul 17 , 2026 | 04:52 AM