Fishermen Cooperative Federation: రేపు మత్స్యకార సమాఖ్య ఎన్నికలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:39 AM
రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఎన్నికలు బుధవారం విజయవాడలోని ఆప్కాఫ్ కార్యాల యంలో జరగనున్నాయి.
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఎన్నికలు బుధవారం విజయవాడలోని ఆప్కాఫ్ కార్యాల యంలో జరగనున్నాయి. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్ నాయక్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. సమాఖ్య చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకు అదే రోజు నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన, అవసరమైతే పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,136 మత్స్యకార సహకార సంఘాలున్నాయి. రాష్ట్ర సమాఖ్య చైర్మన్, వైస్‌చైర్మన్‌ను జిల్లా సమాఖ్యల ద్వారా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పదవులపై అధికార పార్టీలో రెండు వర్గాలు పోటీ పడుతున్నట్లు సమాచారం.