Medical Achievement: విజయవంతంగా మోచేతి కీలు మార్పిడి శస్త్రచికిత్స
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:40 AM
రాష్ట్రంలోనే తొలిసారిగా మోచేతి కీలు మార్పిడి (ఎల్‌బో రీప్లే్‌సమెంట్) ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి అరుదైన ఘనత సాధించారు గుంటూరుకు చెందిన సాయి భాస్కర్ మల్టీ ....
రాష్ట్రంలో తొలిసారిగా.. సాయిభాస్కర్ హాస్పిటల్స్ వైద్యుల ఘనత
గుంటూరు మెడికల్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే తొలిసారిగా మోచేతి కీలు మార్పిడి (ఎల్‌బో రీప్లే్‌సమెంట్) ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి అరుదైన ఘనత సాధించారు గుంటూరుకు చెందిన సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్యులు. మంగళవారం గుంటూరు అరండల్‌పేటలోని సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, హాస్పిటల్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి ఆపరేషన్ వివరాలను వివరించారు. గుంటూరు పొట్టి శ్రీరాములునగర్‌కు చెందిన చాంద్ బీ (67) అనే మహిళ రుమటాయిడ్ ఆర్థరైటి్‌సతో బాధపడుతుండగా, ఏడు సంవత్సరాల కిందట రెండు మోకీలు మార్పిడి ఆపరేషన్లు నిర్వహించారు. కొంతకాలంగా మోచేతి కదలికలు క్షిణిస్తూ రావడంతో రోజువారి కార్యకలాపాల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. దీంతో మోచేతి కీలు మార్పిడి తప్పనిసరి అయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మోచేతి కీలు మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ నరేంద్రరెడ్డి తెలిపారు. మూడు వారాలకే పూర్తిస్థాయిలో పను లు నిర్వహించుకునే స్థాయికి చాంద్‌బి వచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా రోబోటిక్ తుంటి మార్పిడి ఆపరేషన్లను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో త్వరలోనే యాంకిల్ (మడమ) రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించేందుకు సిద్థమవుతున్నామని డాక్టర్ నరేంద్ర రెడ్డి తెలిపారు. నిరుపేదలకు మోచేతి కీలు మార్పిడి ఆపరేషన్లు ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతో... గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించేందుకు సిద్థంగా ఉన్నామని ప్రకటించారు. రోగి చాందిబి మాట్లాడుతూ ఆపరేషన్ అనంతరం పూర్తిస్థాయిలో మోచేతి కదలికలను తిరిగొచ్చాయని, తనకు తానుగా భోజనం చేస్తున్నానని చెప్పారు.