Share News

పంచాయతీ ఎన్నికల తొలి ప్రక్రియ ప్రారంభం

ABN , Publish Date - Feb 08 , 2026 | 04:30 AM

మార్చి నెలాఖరు నాటికి గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ఎన్నికల..

పంచాయతీ ఎన్నికల తొలి ప్రక్రియ ప్రారంభం

  • వచ్చే నెల 9 నాటికి వార్డుల వారీ ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మార్చి నెలాఖరు నాటికి గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసింది. మార్చి 9 నాటికి గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు కమిషన్‌ సూచించింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి సిద్ధమైన అసెంబ్లీ ఓటర్ల జాబితా తీసుకుని, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలి. అందుకు డెడికేటెడ్‌ కమిషన్‌ వేయాల్సి ఉంది. మరోవైపు మార్చి నెలాఖరుకు ప్రస్తుతమున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని పదవీ కాలం ముగియనుంది. ఈ లోపు కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేయాలి. ఈ ప్రక్రియలు పూర్తికావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

Updated Date - Feb 08 , 2026 | 04:32 AM