విశాఖలో వించ్ పారాసెయిలింగ్
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:57 AM
రాష్ట్రంలో తొలిసారిగా రుషికొండ సాగర తీరంలో వించ్ పారాసెయిలింగ్ (పడవ వెనుక పారాచూట్ సాయంతో గాలిలో ప్రయాణం) ట్రయల్ రన్ నిర్వహించారు.
విశాఖపట్నం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలిసారిగా రుషికొండ సాగర తీరంలో వించ్ పారాసెయిలింగ్ (పడవ వెనుక పారాచూట్ సాయంతో గాలిలో ప్రయాణం) ట్రయల్ రన్ నిర్వహించారు. ఏపీటీడీసీ పిలిచిన టెండర్లలో నిర్వహణ హక్కులను కైవసం చేసుకున్న ‘ఫన్ అడ్వంచర్స్’ సంస్థ నిర్వాహకులు సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘పడవలో ఒకేసారి 15 మంది ప్రయాణికులు వెళ్లవచ్చు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్(ఎన్‌ఐడబ్ల్యుఎ్‌స)లో శిక్షణ పొందిన ఒక డైవర్, ఇద్దరు సహాయకుల పర్యవేక్షణలో ఈ అడ్వంచర్ సాగుతుంది’ అని వివరించారు.